
రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు బిజూ జనతాదళ్ (బీజేడీ), భారతీయ జనతా పార్టీల మధ్య ఓ వైపు చర్చలు జరుగుతుండగానే బీజేపీ ఒడిశా ఎన్నికల ఇన్‌ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
‘మొత్తం 147 విధానసభ , 21 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా సీట్లు, లోక్‌సభ ఎన్నికలలో 16కు పైగా సీట్లు గెలుస్తాం." అని తోమర్ అన్నారు. ప్రస్తుతం బీజేపీ పోటీ చేసే అభ్యర్థులపై చర్చలు జరుపుతోందన్నారు.
‘పొత్తు గురించి మేం ఏమీ చర్చించలేదు. ఏయే స్థానాల నుంచి ఎవరిని పోటీ చేయించాలి. రాష్ట్రంలో మా పార్టీ పరిస్థితి, లోక్‌సభ , విధానసభ ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులపై మాత్రమే చర్చించాం. త్వరలో మరిన్ని చర్చలు జరుపుతాం’ అని తోమర్ చెప్పారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర నాయకత్వంతో బీజేడీ సమావేశాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ పరిణామాల గురించి తనకు తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment