సాక్షి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సీట్లు కేటాయింపుల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్‌స్వీప్ కొట్టాలనే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్‌లో తుమ్మల నాగేశ్వర రావు చేరిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఖమ్మం లేదా కొత్తగూడెం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. తుమ్మల కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైన నేపథ్యంలో సీట్లు సర్దుబాటు విషయంలో హస్తం పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, తుమ్మల పాలేరు నుంచి మాత్రమే బరిలో ఉంటానని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు పంపించారు. దీంతో, పాలేరులో తుమ్మలకు గ్రీన్‌సిగ్నల్ వస్తే పొంగులేటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పొంగులేటిని ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
సీనియర్ల ధీమా ఇదే..
ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కాంగ్రెస్‌లో చేరితే కొత్తగూడెం టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు హస్తం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అప్పుడు.. పొంగులేటిని ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిపే అవకాశాలను కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక, ఉమ్మడి జిల్లాలో మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆలోచన అని సీనియర్లు చెబుతున్నారు. తద్వారా ఖమ్మం జిల్లాలో 10 సీట్లను గెలుచుకోవచ్చనే ధీమాతో హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వేములవాడలో నో టికెట్.. చెన్నమనని పొలిటికల్ కౌంటర్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment