
దొంగే దొంగ అన్న చందంగా తయారైంది తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు పరిస్థితి
సాక్షి, తిరుపతి: దొంగే దొంగ అన్న చందంగా తయారైంది తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు పరిస్థితి. టీడీపీ నేతలు ఉదయం నుంచి దొంగ ఓట్లు వేసి నిబంధనలకు తూట్లు పొడిచారు. అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోంది అంటూనే.. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. రిగ్గింగ్‌కు పాల్పడుతూ టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వీడియోలో టీడీపీ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థులకు ఏక పక్షంగా బ్యాలెట్ పేపర్‌పై దొంగ ఓట్లు వేస్తున్న వీడియో వీరి డ్రామాలకు అద్దం పడుతోంది.
చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే..