సాక్షి, హైదరాబాద్: దేశంలో చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ అన్నా రు. నేతన్నల ఆత్మహత్యలు నిత్య కృత్యమైన స్థితి నుంచి ఆత్మస్థైర్యంతో సగౌరవంగా బతికే స్థాయికి తీసు కొచ్చామని చెప్పారు. దేశంలో చేనేత కార్మికులకు యార్న్‌పై 40 శాతం సబ్సిడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞా నాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.
ఈ మేరకు సంజయ్‌కు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా అరకొర బడ్జెట్ ఇచ్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా రూ. వందల కోట్లను ఒకేసారి బడ్జెట్‌లో కేటా యించామని చెప్పారు. నేతన్న రుణాలను మాఫీ చేసి అప్పుల ఊబి నుంచి కాపాడామన్నారు. నేత న్నకు చేయూత పేరుతో ప్రారంభించిన పొదుపు పథకం కోవిడ్ సంక్షోభంలో వాళ్లకు ఆపన్న హస్తం గా మారిందన్నారు. మగ్గాల అధునీకరణ నుంచి వర్కర్ ఓనర్ పథకం వరకు తాము చేపట్టిన కార్యక్రమాలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అ యిందన్నారు. టెక్స్‌టైల్ పరి శ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కాక తీయ టెక్స్‌టైల్ పార్కు మెదలుకుని అనేక మౌలిక వసతులను అభివృద్ధి చేశామని చెప్పారు.
కేంద్రాన్ని సంజయ్ నిలదీయాలి..
అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న సంజయ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయి అవకా శవాదంగా మాట్లాడుతున్నారని కేటీ ఆర్ విమర్శించారు. కేంద్రంలో అధికా రంలో ఉన్న పార్టీ ఎంపీగా తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం, వారి భవి ష్యత్తు కోసం పార్లమెంట్‌లో ఏనాడైనా ఒక్క మాటైనా మాట్లాడారా అని సంజయ్‌ను నిలదీశారు.
ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాలపై రాజకీయాలు చేసిన పార్టీల సంస్కృతిని తిరిగి రాష్ట్రంలోకి తీసుకు రావా లని ఆయన అనుకుంటున్నట్టున్నారని ధ్వజ మెత్తారు. నేతన్నల అభివృద్ధికి అండగా నిలవాల్సిన కేం ద్రం సహాయ నిరాకరణ చేస్తోందని, దీనిపై కేంద్రాన్ని సంజయ్ నిలదీయాలని సూచించారు.
‘కాకతీయ’ ఆర్థిక సాయంపై పట్టించుకోవట్లే...
టెక్స్‌టైల్ ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ పన్ను వçసూ లు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్మా ర్గపు ప్రభుత్వం బీజేపీదని కేటీఆర్ విమర్శించారు. దేశంలో తొలిసారి చేనేత రంగంపై పన్నులు మోపిన పాపపు ప్రభుత్వం బీజేపీదని మండిప డ్డారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా ఎత్తేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందిం చలేదని.. అలాంటి సర్కారు తరçఫున మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలంటే కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. నేతన్నకున్న అన్ని బీమా పథకాలను కేంద్రం రద్దు చేస్తే తమ ప్రభుత్వం బీమా కల్పిస్తోందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment