
సనత్‌నగర్ (హైదరాబాద్): వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. అసెంబ్లీలో 20 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అమీర్‌పేట అపరాజిత కాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ..ఇలా ఎవరి సొత్తు కాదని.. తెలంగాణ అమరవీరులదన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి మాట్లాడుతూ.. తన భార్య శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడించారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఇన్నాళ్లు మభ్య పెట్టారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment