
మహబూబ్‌నగర్ నియోజకవర్గం
గెజిటెడ్ అదికారుల సంఘం అధ్యక్షుడుగా తెలంగాణ ఉద్యమంలో ఒక భూమిక పోషించిన మహబూబ్‌నగర్ సిటింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ రెండోసారి విజయం సాదించారు. ఆ తర్వాత ఆయనకు కెసిఆర్ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. టిఆర్‌ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన శ్రీనివాసగౌడ్ తన సమీప టిడిపి ప్రత్యర్ది ఎమ్.చంద్ర శేఖర్‌పై 57775 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీచేసింది. శ్రీనివాసగౌడ్‌కు 86474ఓట్లు రాగా, చంద్రశేఖర్‌కు 28699 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసి ఇబ్రహిం సయ్యద్‌కు 21600 పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడో స్థానంలో నిలిచారు.
2014లో శ్రీనివాస గౌడ్ , బిజెపి నేత శ్రీనివాసరెడ్డిపై 3139 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఇక్కడ 2014లో కాంగ్రెస్‌తో పాటు, టిఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్ధి కూడా ఉన్నా, టిఆర్‌ఎస్ నేతగా శ్రీనివాసగౌడ్ విజయం సాధించడం విశేషం. మహబూబ్ నగర్‌లో పదకుండుసార్లు బిసి నేతలు, నాలుగుసార్లు రెడ్డి నేతలు,రెండుసార్లు ముస్లిం నేతలు గెలుపొందారు. 2009లో గెలిచిన స్వతంత్ర సభ్యుడు రాజేశ్వరరెడ్డి ఆకస్మికంగా మరణించడంతో జరిగిన ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్నెం శ్రీనివాసరెడ్డి సంచలన విజయం సాధించారు. కాని2014 సాధారణ ఎన్నికలో ఓటమిపాలయ్యారు. 2004లో కూడా ఇక్కడ ఇండిపెండెంటుగా పోటీచేసిన కాంగ్రెస్ ఐ తిరుగుబాటు అభ్యర్ధి పులివీరన్న గెలిచారు.
మహబూబ్‌నగర్‌కు కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్ రెండుసార్లు, బిజేపి ఒకసారి, ప్రజాపార్టీ ఒకసారి గెలుపొందగా, ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ నుంచి నెగ్గారు. టిడిపి పక్షాన సీనియర్ నేత పి. చంధ్రశేఖర్ మహబూబ్‌నగర్‌లో నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన వారిలో ఇబ్రహిం ఆలీ అన్సారీ, ఎమ్. రామిరెడ్డి, పులి వీరన్నలు రెండేసి సార్లు గెలిచారు. చంధ్ర శేఖర్ గతంలో ఎన్.టి.ఆర్.,చంద్రబాబు క్యాబినెట్‌లలో పనిచేస్తే, పులి వీరన్న 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్‌లో ఉన్నారు. ఇబ్రహిం ఆలీ అన్సారీ పూర్వం కాసు, పి.వి., జలగం, క్యాబినెట్‌లలో ఉన్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..