పులివెందులలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
మనం చేసిన మంచి అందరికీ తెలుసు
తప్పకుండా ప్రజలు మళ్లీ మన వైపే చూస్తారు
నేతలు, కార్యకర్తలతో మాటామంతి
మూడో రోజు ప్రజలతో మమేకం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లా డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలను స్వీకరించారు.
సాక్షి కడప: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో మూడవ రోజు సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్యాంపు కార్యాలయానికి భారీగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పులివెందులలో ఉన్నారని తెలుసుకుని రాయలసీమలోని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.
అందరితోనూ ఓపికగా మాట్లాడారు. పలువురు నేతలను పేరుపేరునా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ చూసినా జనం భారీగా కనిపించారు. ‘వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మనం చేసిన మంచి అందరికీ తెలుసు. ప్రజల గుండెల్లో ఉండిపోయింది. తప్పకుండా ప్రజలు మళ్లీ మన వైపే చూస్తారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. అండగా ఉంటాం’ అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
పార్టీ నేతలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
రెండు కుటుంబాలకు పరామర్శ
పులివెందుల నారాయణ పాఠశాల సమీపంలోని పురుషోత్తం నగర్‌లో నివాసముంటున్న దివంగత మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు మైఖెల్ వర్ధంతి కార్యక్రమం ఇటీవల జరిగింది. అప్పట్లో రాలేక పోయిన వైఎస్ జగన్.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి సోమవారం ఉదయం మైఖెల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైఖెల్ సతీమణి అమూల్యారాణి, కుమారుడు వినీత్‌లను ఓదార్చారు. సమీప బంధువు నర్రెడ్డి సంగిరెడ్డి మృతి చెందారని తెలిసి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు
వైఎస్ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డిలు నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి.. సంగిరెడ్డి భార్య సత్యవతి, కుమారులు సుధాకర్‌రెడ్డి, సునీల్‌రెడ్డిలను జగన్ దంపతులు ఓదార్చారు. ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు చవ్వా సుదర్శన్‌రెడ్డి, మిట్టా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు.
మరోసారి విషం కక్కిన ఎల్లో మీడియా
సాక్షి బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. వైఎస్ జగన్‌పై కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని ఒక మార్ఫింగ్ వీడియోను వదిలారు. వైఎస్ జగన్ సోమవారం పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసం వద్దకు వందలాదిగా చేరుకున్నారు. జగన్‌తో మాట్లాడాలని, ఫొటో దిగాలని పెద్ద సంఖ్యలో యువకులు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంటి వద్దకు ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇది గిట్టని ఎల్లో మీడియా కొద్ది గంటల్లోనే ఈ వీడియోలోని వాయిస్‌ను మార్చి ‘జగన్ డౌన్ డౌన్..’ అన్నారని నిస్సిగ్గుగా విషం కక్కింది. పులివెందులలో సైతం ఇదే రీతిలో దుష్ప్రచారం చేసి ఖంగుతింది. అయినా పద్ధతి మార్చుకోక బెంగళూరులోనూ అదే వైఖరి ప్రదర్శించి అభాసుపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment