గుంటూరు, సాక్షి: సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగనా?.. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబా? అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేడర్‌ను ఉద్దేశించి మాట్లాడారాయన.
వైఎస్సార్‌సీపీకి ఎన్నికల టార్గెట్ క్లియర్‌గా ఉంది. పరీక్షలు రాసే పిల్లల్లా.. పని చేయాలి. రాబోయే ఈ 50 రోజులు ఇదే పని. సునామీలాగా వస్తున్న ఆదరణను.. పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్ లను(ఒకటి అసెంబ్లీ, రెండోది లోక్‌సభ కోసం) నొక్కించాలి అని సజ్జల అన్నారు.
.. 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం. అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చింది. రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్ల లో తిరుగుతున్నాడు అని సజ్జల ఎద్దేవా చేశారు.
.. ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు. సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రంగా ఏపీని జగన్ తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింది. అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉంది. వైఎస్సార్‌సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారు. అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాం. మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చాం. ఇకపై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తాం అని సజ్జల ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment