పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

Published Sun, May 5 2024 3:05 AM

పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్‌

● కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ● సిరిసిల్ల, వేములవాడల్లో ఈవీఎంల కమిషనింగ్‌

సిరిసిల్ల: ఈవీఎంల కమిషనింగ్‌ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడల్లో పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను శనివారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా కమిషనింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎంలపై సీరియల్‌ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాలను పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌పోలింగ్‌ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ నిర్వహణ వివరాలను ఏఆర్వోలను అడిగి తెలుసుకున్నారు.

ఫెసిలిటేషన్‌ కేంద్రాల సందర్శన

సిరిసిల్లలోని గీతానగర్‌ పాఠశాల, వేములవాడలోని నూతన గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సజా వుగా జరిగేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశా రు. అదనపు కలెక్టర్‌, సిరిసిల్ల ఏఆర్వో పి.గౌతమి, వేములవాడ ఏఆర్వో రాజేశ్వర్‌, సిరిసిల్ల ఆర్డీవో ర మేశ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్లు షరీఫ్‌ మొహినొద్దీన్‌, మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement