ఉత్సాహంగా సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ లెవల్–2 పరీక్ష
కొత్త పదాలు నేర్చుకుంటా
స్పెల్‌బీ లెవల్–2 పరీక్ష రాశా. లెవల్–1 కంటే లెవల్–2లో న్యూ వర్డ్స్ నేర్చుకున్నా. చాలా కొత్త పదాలున్నాయి. బుక్స్‌లో లేని పదాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకున్నా. జోనల్ 3 రౌండుకు కూడా సెలెక్టవుతా. ఇంకా కొత్తకొత్త పదాలు నేర్చుకుంటా.
– ఆదిత్య, చాక్లెట్ హైస్కూల్
ఇంగ్లిష్‌పై పట్టు సాధించా
స్పెల్‌బీతో ఇంగ్లిష్‌పై పట్టు సాధించా. స్పెల్లింగ్స్ కూడా చాలావరకు నేర్చుకున్న. సెకండ్ రౌండ్ బాగా రాశా. జోనల్ ఫైనల్ రౌండ్‌కు కూడా అర్హత సాధిస్తా. ఇంగ్లిష్ పదాలు మరిన్ని నేర్చుకోవాలనిపిస్తోంది. స్పెల్‌బీ పరీక్ష బాగుంది. ఇంగ్లిష్‌లో కొత్తకొత్త పదాలు తెలిశాయి.
– అనన్యశ్రీ, శ్రీప్రగతి హైస్కూల్
● వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆదివారం కరీనంగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో సాక్షి స్పెల్ బీ , మ్యాథ్స్‌బీ లెవల్–2 పరీక్ష ఉత్సాహంగా సాగింది. వి ద్యార్థులకు వారివారి కేటగిరీలవారీగా పరీక్షలను ని ర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 11 వరకు స్పెల్‌బీ, 11 గంటల నుంచి 12 వరకు మ్యాథ్స్‌బీ పరీక్షను నిర్వహించారు. కేటగిరి 1లో భాగంగా 1, 2 తరగతుల విద్యార్థులకు, 2వ కేటగిరిలో 3, 4 విద్యార్థుల కు, 3వ కేటగిరిలో 5, 6, 7, 4వ కేటగిరి లో 8, 9, 10 విద్యార్థులకు నిర్వహించారు. లెవల్–2లో అర్హత సాధించిన విద్యార్థులను హైదరాబాద్‌లో జరిగే లెవల్–3 పరీక్షలకు నిర్వాహకులు ఎంపిక చేయనున్నారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్న సాక్షి స్పెల్‌బీ
ఇంగ్లిష్, మ్యాథ్స్‌ను విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చకుంటారని విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తోంది సాక్షి స్పెల్‌బీ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డి అన్నారు. సాక్షి స్పెల్‌బీ పరీక్షలను ఆయన పరీశిలించి మాట్లాడారు. స్పెల్‌బీతో ఆరోగ్యవంతమైన పోటీ విద్యార్థుల మధ్య ఏర్పడుతోందన్నారు. ఈ పరీక్షకు వివిధ పాఠశాలల నుంచి లెవల్–1లో సెలెక్ట్ అయిన సుమారు 160 మంది విద్యార్థులు హాజరైనట్లు సాక్షి కరీంనగర్ బ్రాంచి మేనేజర్ వైద శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఏడీవీటీ డిప్యూటీ మేనేజర్ ఊరగొండ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ ముస్కుల విద్యాసాగర్‌రెడ్డి, సిబ్బంది వేముల శ్రీనివాస్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి స్పెల్‌బీకి ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వైఫై, అసోసియేట్ స్పాన్సర్‌గా రాజమండ్రికి చెందిన ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment