ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిఘటిద్దాం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ కోరారు. నవంబర్ 26న జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమ కరపత్రాలను ఆదివారం సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో విడుదల చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, సహాయ కార్యదర్శి అన్నల్దాస్ గణేశ్, తన్నీరు లక్ష్మీనారాయణ, జిందం కమలాకర్, బింగి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ
26న సిరిసిల్లలో నిరసన
Comments
Please login to add a commentAdd a comment