హరహర.. శివశివ..
వేములవాడ: కార్తీక మాసం సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు ఆదివారం లక్ష మంది భక్తులు తరలివచ్చారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు రాజన్నకు కోడె మొక్కులు, నిలువెత్తు బెల్లం పంపిణీ, కల్యాణకట్టలో తలనీలాలు, కళాభవన్‌లో సత్యనారాయణ వ్రతాలు, అమ్మవారికి కుంకుమ పూజ మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలను భక్తులు వాడుకున్నారు. కార్తీక మాసం కొనసాగుతుండటంతో మహిళలు, సుహాసినులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భక్తుల ద్వారా రూ.60లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బద్ది పోచమ్మ, నగరేశ్వర, భీమేశ్వరాలయాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment