మాజీ ఎంపీ సతీమణి మృతి
కరీంనగర్/సిరిసిల్ల: పెద్దపల్లి మాజీ ఎంపీ, నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే గొట్టె భూపతి సతీమణి శాంతమ్మ(76) ఆదివారం కరీంనగర్‌లో కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన గొట్టె భూపతి 1967, 1972లోనూ రెండుసార్లు ఇండిపెండెంట్‌గా నేరెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి ఎంపీగానూ రెండుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం గొట్టె భూపతి కుటుంబం కరీంనగర్‌లో ఉంటోంది. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న శాంతమ్మ ఆదివారం మృతిచెందారు. గొట్టె భూపతి, శాంతమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. సుధీర్‌బాబు, సుమన్‌బాబు, సుజన్‌బాబు. సుధీర్‌బాబు ఐపీఎస్ ఆఫీసర్‌గా రాచకొండ పోలీస్ కమిషనర్‌గా పని చేస్తుండగా.. సుమన్‌బాబు 2001లో ఇల్లంతకుంట జెడ్పీటీసీగా గెలిచారు. ఆయన గుండెపోటుతో మరణించారు. సుజన్‌బాబు న్యాయవాది. శాంతమ్మ మరణ వార్త తెలియడంతో తంగళ్లపల్లిలోని కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలివెళ్లారు.
మెగా వైద్యశిబిరం విజయవంతం
సిరిసిల్లటౌన్: జిల్లా వెలమ సంక్షేమ మండలి, హైదరాబాద్ యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హెల్త్‌క్యాంప్ విజయవంతమైంది. సెస్‌చైర్మన్, వెలమ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు క్యాంప్‌ను ప్రారంభించారు. 2డీ, బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్యపరీక్షలు చేసి, పలు సూచనలు ఇచ్చారు. మండలి ప్రధాన కార్యదర్శి గుజ్జునేని వేణుగోపాల్‌రావు, మానేరు స్వచ్ఛందసంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, వైద్యులు గౌడ శ్రీహరి, రమేశ్, నరేశ్, క్యాంప్ కోఆర్డినేటర్ సురేష్, యశోద ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు పోటీల్లో రాణించాలి
● బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్లటౌన్: జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించాలని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆకాంక్షించారు. సిరిసిల్లలోని రైజింగ్ ఫిట్‌నెస్, స్పోర్ట్స్ అకాడమీ ఈస్టర్‌వేల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్–19 టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలకు 25 జట్లు హాజరయ్యాయి. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రెటరీ బసవవేణి లక్ష్మణ్, జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్, కృష్ణహరి, టోర్నీ నిర్వాహకులు ప్రేమ్, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment