మాలలు సంఘటితం కావాలి
● మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంప్రసాద్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఏబీసీడీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో మాలలు సంఘటిత పోరాటాలు చేయాలని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ కోరారు. డిసెంబర్ 1న ‘హలోమాల.. చలో హైదరాబాద్’ సింహగర్జన వాల్‌పోస్టర్లను ఆదివారం ఎల్లారెడ్డిపేటలో ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన సింహగర్జన సభకు భారీగా తరలిరావాలని కోరారు. నాలుక సత్యం, ప్రసాద్, సందీప్, లక్ష్మణ్, గడ్డం జితేందర్, కొత్త మల్లయ్య, బుర్క బాబు, మధు పాల్గొన్నారు.
చందుర్తి ఏఎస్సై ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్
చందుర్తి(వేములవాడ): కేసు నమోదులో జాప్యం చేశారనే ఆరోపణల నేపథ్యంలో చందుర్తి ఏఎస్సై, ఇన్‌చార్జి ఎస్ హెచ్‌వో బాపును శనివారం రాత్రి ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. చందుర్తి మండలం నర్సింగాపూర్‌కు చెందిన అంజయ్యకు మండలకేంద్రానికి చెందిన శేఖర్ రూ.50వేలు అప్పుగా ఇచ్చాడు. అంజయ్య నాలుగేళ్లు గడుస్తున్నా బాకీ చెల్లించకపోవడంతో అతని ట్రాక్టర్‌ను శేఖర్ తీ సుకెళ్లాడు. తన ట్రాక్టర్ ఇప్పించాలని బాధితుడు అంజయ్య పోలీసులను నాలుగు రోజుల క్రితం ఆశ్రయించాడు. కేసు నమోదు చేయకుండా ఏఎస్సై జాప్యం చేస్తుండడంతో బాధితుడు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డిని ఆశ్రయించాడు. ఈనేపథ్యంలో ఏఎస్సై బాపును ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్డ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment