అనారోగ్యంతో విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

Published Mon, Nov 25 2024 7:09 AM | Last Updated on Mon, Nov 25 2024 7:09 AM

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

జమ్మికుంట(హుజూరాబాద్‌): పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అనారోగ్యంతో ఓ విద్యార్థి మృతిచెందింది. పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుల నిర్ణక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఫిర్యా దుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన రవి–ఇందిర దంపతులు పట్టణంలోని కేశవపూర్‌కు ఇల్లరికం వచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు నిత్యశ్రీ(15)ని పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో చేర్పించారు. నిత్యశ్రీ 10వ తరగతి చదువుతోంది. ఈనెల 17న విద్యార్థిని అస్వస్థతకు గురికాగా.. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి హాస్టల్‌లో చేర్పించారు. త ర్వా త విద్యార్థిని పరిస్థితి విషమంగా మారగా.. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సుప్రియ, ఉపాధ్యాయురాలు, ఏఎన్‌ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెల 21న తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. నిత్యశ్రీని హన్మకొండ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కూతురు మృతికి పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు కారణమని తండ్రి రవి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ తెలిపారు. పాఠశాల ఆవరణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

డీఈవో విచారణ

డీఈవో జనార్దన్‌రావు పాఠశాలలో ఆదివారం సాయంత్రం విచారణ చేపట్టారు. విద్యార్థి మృతి విషయాన్ని గోప్యత పాటించి విచారణ జరిపారనే ఆరోపణలున్నాయి. వివరాలు తెలుసుకునేందుకు డీఈవోను ఫోన్‌ ద్వారా సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement