అర్హులకు ‘పీఎం విశ్వకర్మ’ ఇవ్వాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్
సిరిసిల్ల: అర్హులకు నిబంధనల ప్రకారం పీఎం విశ్వకర్మ అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పీఎం విశ్వకర్మపై కలెక్టరేట్ నుంచి బుధవారం ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ద్వారా వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారి అప్లికేషన్, డిక్లరేషన్, కులం సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఇతర వివరాలను జిల్లా పరిశ్రమల శాఖకు పంపించాలని ఆదేశించారు. సిరిసిల్ల పట్ట ణంలో 101, వేములవాడ మున్సిపాలిటీలో 72, బోయినపల్లి మండలంలో 178, చందుర్తిలో 232, ఇల్లంతకుంటలో 667, గంభీరావుపేటలో 185, కోనరావుపేటలో 347, ముస్తాబాద్‌లో 166, రుద్రంగిలో 61, తంగళ్లపల్లిలో 372, వీర్నపల్లిలో 168, వేములవాడ రూరల్‌లో 38, వేములవాడ అర్బన్‌లో 237, ఎల్లారెడ్డిపేట మండలంలో 274 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదైనట్లు అధికారులు వివరించారు. అన్ని అర్హతలు ఉన్న వారికి ప్రయోజనం దక్కేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, పరిశ్రమలశాఖ ఏడీ భారతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేశ్, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెండింగ్ ప్రాజె క్టు పనులు పూర్తి చేస్తామని, ప్రత్యేక అధికారులను నియమించి పనులు జరిగేలా చూస్తామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని సా గునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పెండింగ్ ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. పెద్దపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం, పత్తిపాక రిజర్వాయర్ తదిత ర అంశాలపై చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్‌లను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజీ–9,10,11,12లో మిగిలిపోయిన పనులకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామన్నారు. ధాన్యం సేకరణ, డేటా ఎంట్రీ వేగంగా పూర్తి చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు రోజుల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 248 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 25,012మంది రైతుల వద్ద 1,57,879 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ప్యాకేజీ 9,10,11,12 పెండింగ్ పనులు, భూ సేకరణ తదితర పనులు వేగంగా పూర్తి చేస్తామని వివరించారు.
కలెక్టర్‌ను కలిసిన టీజీవో నూతన కార్యవర్గం
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం జిల్లాశాఖ నూతన కార్యవర్గం కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జబీఉల్లా, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ జె.రాజు, కోశాధికారిగా అబ్దుల్ రసూల్ అహ్మద్, ఉపాధ్యక్షులు డాక్టర్ అంజిరెడ్డి, అబ్దుల్ వాజిద్, ఎన్.శరత్ కుమార్, ఎన్.ఆర్.మల్హోత్రా, ఎం.జానకీ, జాయింట్ సెక్రటరీలు ఎ.సాయికిరణ్, బి.శ్రీకాంత్, వి.చంద్రకళ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సాగర్, పబ్లిసిటీ సెక్రటరీ బి.కిరణ్, ఆఫీస్ సెక్రటరీ కె.వరుణ్, కల్చరర్ సెక్రటరీ కె.వినోద్, స్పోర్ట్స్ సెక్రటరీ వి.లక్షణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఆర్.శేఖర్, ఏ.కవిత, ఎన్.భాగ్యలక్ష్మి, ఎం.శ్రావ్యపటేల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment