ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్‌లోకి డీఎస్పీ కార్యాలయం
వేములవాడ: వేములవాడ బైపాస్‌రోడ్డులో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్ నిర్మించారు. కొద్ది రోజులుగా ఈ భవనం ఖాళీగా ఉంటోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, వేములవాడలో ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలవడం, ఆయన తన నివాసం నుంచే పాలన సాగిస్తుండడంతో ఖాళీగా ఉన్న గెస్ట్‌హౌస్‌లోకి డీఎస్పీ కార్యాలయాన్ని బుధవారం మార్చారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పూజలు చేసి, లాంఛనంగా ప్రారంభించారు. బైపాస్‌రోడ్డులోని మున్నూరుకాపు సత్రం పక్కనే ఓ ప్రైవేట్ నివాసంలో డీఎస్పీ కార్యాలయం కొనసాగేది. ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్‌లోకి డీఎస్పీ కార్యాలయం మారడంతో జనాలకు మరింత సౌకర్యవంతమైందని చెబుతున్నారు.
హుండీ కౌంటింగ్‌లో పటిష్ట నిఘా
వేములవాడ: వేములవాడ రాజన్న హుండీ లెక్కింపులో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం జరిగిన హుండీ లెక్కింపులో సీసీ కెమెరాల నిఘాతోపాటు ఆలయ ఫొటోగ్రాఫర్‌తో వీడియో రికార్డింగ్ చేయించారు. గతంలో హుండీ లెక్కింపులో కొంతమంది రాజన్న సొమ్ముకు కన్నం వేసిన విషయం విధితమే. దీన్ని అదుపు చేసేందుకు హుండీ కౌంటింగ్ సమయంలో నిబంధనలు కఠినతరం చేశారు. కౌంటింగ్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందించే ఆయా స్వచ్ఛంద సంస్థల సభ్యులకు ఆలయ అధికారులు ఉచితంగా రాజన్న దర్శనంతోపాటు రెండు లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నారు. బుధవారం లెక్కింపునకు హాజరైన దాదాపు 350మంది సభ్యులకు హుండీ లెక్కింపు అనంతరం స్పెషల్ క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు.
పారదర్శకంగా ఈజీఎస్ ఆడిట్
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధిహామీ పనుల సోషల్ ఆడిట్ పారదర్శకంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో ఎస్.వినోద్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో 15వ విడత సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్‌పై సమన్వయ సమావేశం నిర్వహించారు. 01–04–2023 నుంచి 31–03–2024 వరకు జరిగిన రూ.4.58 కోట్ల పనులకు సంబంధించిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమా జయశీల, ఎస్‌ఆర్పీ భగవంతరావు, ఈజీఎస్ ఏపీవో వనం సబిత, ఎంపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శులున్నారు.
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి జీపీఏతో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవో రమేశ్‌కుమార్ సూచించారు. మండలంలోని మల్లాపూర్ హైస్కూల్, కొత్తపేట ప్రైమరీ పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. మల్లాపూర్ హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వచ్చే విద్యా సంవత్సరం సంఖ్య పెంచాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలన్నారు. మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కె.రామారావు, ఉపాధ్యాయులు శ్రీనివాస గంగ, విజయ, చంద్రం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment