డాక్టర్ల సూచన మేరకే మందులు వాడాలి
సిరిసిల్ల/వేములవాడ: డాక్టర్ల సూచన మేరకే యాంటీ బయాటిక్స్ వాడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) డాక్ట ర్లు రూపొందించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. డాక్టర్ల సూచన మేరకు యాంటీబయాటిక్స్ వాడితే ఎలాంటి నష్టం ఉండదని, విచ్చలవిడిగా వాడితే అనార్థాలు ఉన్నాయని అన్నారు. దీనిపై ప్రజలను చైతన్య వంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ఐఎంఏ డాక్టర్లు కృషి చేయాలని కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ మాట్లాడు తూ ఇష్టమొచ్చినట్లు యాంటీ బయాటిక్స్ వాడితే.. భవిష్యత్‌లో మళ్లీ ఆ మందులు పని చేయకుండా పోతాయన్నారు. జిల్లా ఐఎంఏ డాక్టర్ల సంఘం కా ర్యదర్శి అభినయ్, ఉపాధ్యక్షులు సీహెచ్ సంతోష్, కోశాధికారి పి.తిరుపతి, సంయుక్త కార్యదర్శి సంతోషాచారి, సీనియర్ డాక్టర్లు కందేపి ప్రసాద్‌రావు, ముళీధర్‌రావు, ఎన్.పద్మలత, ఎన్.మధు, మహేందర్, అనిత, అనిల్‌కుమార్, ప్రదీప్, రవీందర్, సు రేంద్రబాబు, ప్రవీణ్, సింధు, మానేరు స్వచ్చందసంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment