భక్తులు ఎవ్వరికీ డబ్బులివ్వొద్దు
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో కొబ్బరికాయల పేరిట భక్తులను నిలువునా దోచుకుంటున్న వైనం ‘సాక్షి’లో ఈనెల 27న ప్రచురితమైంది. ఈ కథనానికి ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, ఏఈవో శ్రవణ్ స్పందించారు. కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తున్న వైనంపై కాంట్రాక్టర్‌పై సీరియస్ అయ్యారు. ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక మైక్ ద్వారా భక్తులెవ్వరూ ఎవరికీ డబ్బులివ్వొదంటూ ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాగా.. ఈ వ్యవహారంలో ఆలయ సిబ్బంది భాగస్వాములైనట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ధర్మగుండంలోని మురుగునీటిని ఖాళీ చేస్తున్న క్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నేరుగా డ్రైనేజీలోకి నీరు వెళ్లేలా చొరవ తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment