కార్మికులకు కూలి తగ్గించొద్దు
సిరిసిల్లటౌన్: మాంద్యం పేరుతో పాలిస్టర్ యజ మానులు పవర్‌లూమ్ కార్మికులకు తక్కువ కూలీ చెల్లించడం సరికాదని పవర్‌లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేష్ అన్నారు. బుధవా రం సిరిసిల్ల బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా భవవనంలో నిర్వహించిన ప్రెస్‌మీట్లో మాట్లాడారు. య జమానులు అగ్రిమెంట్ ప్రకారంగా 10పీకులకు 25 పైసలు చెల్లించకుండా 22 పైసలు కార్మికులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ వారం వేతనాలు అగ్రిమెంట్ ప్రకారంగా 10 పీకులకు 25 పైసలు చొప్పున చెల్లించాలని లేనిపక్షంలో సోమవారం పాలిస్టర్ అసోసియేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కార్మికులతో నిర్వహిస్తామని హెచ్చరించారు. కూలి తగ్గించి ఇవ్వడంతో కార్మికులు రోజుకు రూ.500 చొప్పున నెలకు రూ.2500వరకు కోల్పోవడం జరుగుతోందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు యజమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్‌లూం వర్కర్స్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండు రమేశ్, సహాయ కార్యదర్శి బెజిగాం సురేశ్, బింగి సంపత్, లక్ష్మణ్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment