తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్
సిరిసిల్లటౌన్: తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ అన్న విషయం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తుంచుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంస్కారహీనుడిగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది అన్నారు. అభివృద్ధికి తోడ్పాడు అందించకుండా అనవసర ఆరోపణలు చేయొద్దని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. సిరిసిల్ల ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుడైన కేకే.మహేందర్‌రెడ్డి సీటును కేటీఆర్ హైజాగ్ చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం నీళ్లు, నిధులు, ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, బొద్దుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment