ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దండెం రాంరెడ్డి బుధవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇబ్రహీంపట్నం స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి తుది వరకు ఆధిష్టానంతో దండెం కుస్తీ పట్టారు. టికెట్ తనకే దక్కుతుందని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. దీంతో ఆయన గాంధీభవన్‌లో తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. అధిష్టానం బుజ్జగింపులకు లొంగని ఆయన కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి రెబల్‌గా దండెం పోటీలో ఉంటారని భావించారు. కానీ అనూహ్యంగా ఆయన తన నామినేషన్‌ను ఉప సంహరించుకున్నారు.
‘దండెం’ దారెటో..?
నామినేషన్ ఉపసంహరించుకున్న ఆయన కారెక్కుతారనే వార్తలు నియోజకవర్గ వ్యాప్తంగా చక్కర్లు కొడుతన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తనను నమ్మించి మోసం చేసిందని.. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా ఆయన బీఆర్‌ఎస్‌తో జతకట్టేందుకు సిద్దమవుతున్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై పూర్తి క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment