నేడు షాద్‌నగర్‌కు అస్సాం ముఖ్యమంత్రి రాక | Sakshi
Sakshi News home page

నేడు షాద్‌నగర్‌కు అస్సాం ముఖ్యమంత్రి రాక

Published Wed, May 8 2024 9:30 AM

నేడు

షాద్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం షాద్‌నగర్‌ పట్టణానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ విచ్చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం 7గంటలకు షాద్‌నగర్‌ పట్టణంలో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశానికి అస్సాం ముఖ్యమంత్రితో పాటు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరు కానున్నట్లు తెలిపారు.

ట్రాన్స్‌జెండర్లు

నిర్భయంగా ఓటు వేయాలి

జిల్లా సంక్షేమాధికారి పద్మజారమణ

ఇబ్రహీంపట్నం రూరల్‌: ట్రాన్స్‌జెండర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా సంక్షేమాధికారి పద్మజా రమణ పేర్కొన్నారు. సరూర్‌నగర్‌లోని మహిళా సాధికారిత కేంద్రంలో మంగళవారం ట్రాన్స్‌జెండర్లకు ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఉచిత ట్రాన్స్‌జెండర్‌ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులు అందజేశారు. అనంతరం పద్మజారమణ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న వారు తప్పకుండా ఓటు వేయాలని సూచించారు. మహిళా సాధికారిత కేంద్రంలో ట్రాన్స్‌జెండర్స్‌ కోసం తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ట్రాన్స్‌జెండర్స్‌ ఎక్కడైనా వివక్షకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కోసం కావాల్సిన అఫిడవిట్లు, నోటరీపత్రాలను క్వీర్‌ బందు పేరెంట్స్‌ అసోసియేషన్‌ సంస్థ వ్యవస్థాపకురాలు ముకుందమాల ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయసేవాధికార సంస్థ సెక్రెటరీ శ్రీదేవి, సీడీపీఓలు, మహిళా సాధికారిత సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

జనార్దన్‌రెడ్డితో కొండా భేటీ

మద్దతు ఇవ్వాలని కోరిన విశ్వేశ్వర్‌ రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత బి.జనార్దన్‌రెడ్డితో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన జనార్దన్‌రెడ్డి కొన్నాళ్లుగా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆరోగ్యరీత్యా విరామం తీసుకుంటున్న ఆయన సేవలను పార్టీకి వినియోగించుకోవాలని భావించిన కొండా.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న లోకసభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి జనార్దన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇరువురి కలయికతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కొండా వెంట మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, నాయకులు నవీన్‌ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

బహుజనుల గొంతుకలను

గెలిపించుకోవాలి

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గౌడ సామాజిక వర్గానికి చెందిన బహుజన గొంతుకలు బూర నర్సయ్య గౌడ్‌, పద్మారావు గౌడ్‌లను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌడ జన హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న గౌడ కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యమివ్వకపోవడం బాధాకరమన్నారు. బీసీల్లో అత్యధిక జనాభా కలిగి ఉండి రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషిస్తున్న వీరిని గెలిపించుకోవాలన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ వారసత్వాన్ని పార్లమెంట్‌లో నిలబెట్టాలని కోరారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఇరువురు పని చేశా రని గుర్తు చేశారు. వలస పాలకుల ఆధిపత్యాన్ని ఎదురించి డాక్టర్ల జేఏసీ చైర్మన్‌గా పని చేసిన బూర నర్సయ్యగౌడ్‌, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీపర్‌గా సేవలు అందించిన పద్మారావుగౌడ్‌ను గెలి పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల మధ్య ఉండి వారి హక్కుల కోసం పోరాడుతున్న వీరిని లోక్‌సభకు పంపాలని విజ్ఞప్తి చేశారు.

నేడు షాద్‌నగర్‌కు  అస్సాం ముఖ్యమంత్రి రాక
1/1

నేడు షాద్‌నగర్‌కు అస్సాం ముఖ్యమంత్రి రాక

Advertisement
 
Advertisement
 
Advertisement