సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతుల్లో వేగం పెంచినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు 1,884 ఫైళ్లను పరిష్కరించినట్లు చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో 1,356 ఫైళ్లను పరిష్కరించగా ఈసారి 14.4 శాతం అదనంగా పరిష్కారం అయ్యాయన్నారు. 39 శాతం ఫైళ్లు అదనంగా వచ్చాయన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో దరఖాస్తుదారులు టీజీబీ పాస్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలాంటి జాప్యానికి తావు లేకుండా 10 రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారానికోసారి పెండింగ్ ఫైళ్లపై సమీక్ష నిర్వహించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment