చేపల పెంపకం పరిశీలన
కందుకూరు: దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) నేషనల్ ప్రెసిడెంట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత నర్రా రవికుమార్ మండల పరిధిలోని గూడూరు గేట్ వద్ద నెలకొల్పిన చేపల పెంపకం కేంద్రాన్ని ఆదివారం ఉత్తరాఖండ్ మంత్రి సౌరబ్ బహుగుణ సందర్శించారు. చేపల పెంపకం, మార్కెట్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ అధ్యక్షులు అంజన్‌కుమార్‌గౌడ్, నాగేష్, శ్రీరాములు తదితరులు ఆయనను సన్మానించారు.
సగర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తుక్కుగూడ: ప్రభుత్వం సగర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాబ్‌సిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సగర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సగర్లను సంచార జాతిగా గుర్తించి బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చా లని కోరారు. గత ప్రభుత్వం తమ విజ్ఞప్తి మేరకు తాగునీటి పనులకు మిషన్ భగీరథ పేరు పెట్టిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికిషన్, నాయకులు సురంపల్లి సుధాకర్, సత్యం, మందాడి ఉదయసాగర్, మర్క సురేష్, మహేందర్, మరక సతీష్, చిలుక శ్రీకాంత్, నారాయణ, ఉప్పరి రవి తదితరులు పాల్గొన్నారు.
అంధుల చెస్ పోటీల్లో
ఆకాశ్ ప్రతిభ
ఇబ్రహీంపట్నం: జాతీయ జూనియర్ చెస్ అంధుల చాంయన్‌షిప్ 2024ను ఇబ్రహీంపట్నంకు చెందిన ఆకాశ్ సొంతం చేసుకున్నాడు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ ద బ్లైండ్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఈనెల 20, 21,22 తేదీల్లో నేషనల్ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ ఫర్ ద విజువల్ చాలెంజ్‌డ్–2024 (అంధుల) పోటీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంకు చెందిన వడ్లకొండ నాగరాజు కుమారుడు ఆకాశ్ నగరంలోని బేగంపేట దేవనార్ ఆంధుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చెస్ చాంపియన్‌గా విజయం సాధించిన నేపథ్యంలో బెంగ ళూరులో జరిగే జాతీయ చెస్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో ఆకాశ్ తన ప్రతిభతో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి చెస్ చాంపియన్‌షిప్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ.. జాతీయ చాంపియన్‌షిప్ సాధించడం ఎంతో నంతోషాన్ని కలిగించిందన్నాడు.
చలితో గజగజ
సాక్షి, సిటీబ్యూరో: చలి గజగజ వణికిస్తోంది. తెల్లవారు జామున పొగ మంచు కమ్మేస్తోంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత కూడా తగ్గుముఖం పట్టి 29 డిగ్రీలకు చేరింది. రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి చలి తీవ్రత పెరిగింది. నగరం మొత్తం మీద సగటున కనిష్ట ఉష్ణోగ్రతలు 15.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శివార్లలో మాత్రం అత్యల్పంగా సగటున 12.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయింది. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment