దైవ చింతనతో మానసిక ప్రశాంతత
శంకర్‌పల్లి: మన దేశ సంస్కృతి, సంప్రదాయలను కాపాడుకుంటూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవాటు చేసుకోవాలని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. కార్తీక సమాసం సందర్భంగా మండల కేంద్రంలోని డీఎంఆర్ గార్డెన్‌లో ఆదివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో 132 మంది జంటలతో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లల్లో భక్తిభావం పెంచేలా మంచి భక్తి కథలను చెప్పాలని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలని సూచించారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక సమరసత ఆధ్వర్యంలో ఇలాంటి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సామాజిక సమరత జిల్లా కన్వీనర్ దామోదర్‌రెడ్డి, శంకర్‌పల్లి సభ్యులు శ్రీను, లక్ష్మీరెడ్డి, నందు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తీగుళ్ల నర్సింలు, నర్సింహారెడ్డి, అచ్చిరెడ్డి, నాగిరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, జయరాంరెడ్డి, మహేందర్‌రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment