ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.. ఆయా మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.. పూల తోటలు దెబ్బతిన్నాయి.. మామిడికాయలు నేలరాలాయి.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్లముందే పాడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మునిగిపోయారు.. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
షాబాద్: మండలంలో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. లింగారెడ్డిగూడ, దామర్లపల్లి, సాయిరెడ్డిగూడ, నాందార్‌ఖాన్‌పేట్, పెద్దవేడు, మద్దూరు, హైతాబాద్, సోలీపేట్, నాగర్‌కుంట, మాచన్‌పల్లి, అంతిరెడ్డిగూడ గ్రామాల్లో సాగు చేసిన పూల తోటలు, కూరగాయలు, వరి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన మాణెయ్య, గోపాల్‌రెడ్డి ఇంటి పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కుమ్మరిగూడలో వర్షం, గాలికి మామిడి కాయలు నేలరాలిపోయాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను అంచనా వేసి న్యాయం చేయాలని పంటలు నష్టపోయిన రైతులు కోరుతున్నారు.
కడ్తాల్‌లో కురిసిన వడగళ్లు
కడ్తాల్: మండల కేంద్రంలో శనివారం సాయంత్రం తేలిక పాటి వడగళ్ల వాన కురిసింది. వర్షం కారణంగా కొద్దిసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఉరుములతో కూడిన వడగళ్ల వర్షానికి ఆయా కాలనీల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇక్కట్లు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ జనం, సాయంత్రం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు.
● ఉరుములు, మెరుపులు, వడగళ్లు
కందుకూరు: మండల పరిధిలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన అకాల వర్షంతో నష్టం వాటిల్లింది. కొత్తూరు, కందుకూరు, కటికపల్లి, రాచులూరు, గూడూరు తదితర గ్రామాలో్‌ల్ మామిడి కాయలు నేలరాలాయి. జైత్వారంలో ఒక విద్యుత్ స్తంభం, గూడూరులో రెండు విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల పశువుల కొట్టాలపై ఉన్న రేకులు లేచిపోయాయి.
● ఈదురుగాలులతో కూడిన వర్షం
యాచారం: మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వడగళ్లు కూడా కురిసాయి. ఈదురుగాలులతో మామిడితోటలు, కూరగాయల పంటలు, వరి పంటకు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
న్యూస్‌రీల్
‘అకాల’ నష్టం
‘అకాల’ నష్టం
‘అకాల’ నష్టం
‘అకాల’ నష్టం
‘అకాల’ నష్టం
‘అకాల’ నష్టం
‘అకాల’ నష్టం