మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
పోలీసు అధికారులతో సీపీ అనురాధ
హుస్నాబాద్: గంజాయి, ఇతర మత్తుపదార్ధాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరు కంకణబద్ధులై విధులు నిర్వహించాలని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు. పోలీస్‌లు అంకితభావంతో పని చేయాలని అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట పోలీస్ స్టేషన్లను బుధవారం సీపీ సందర్శించి స్టేషన్ల చుట్టు పరిసరాలు, సీజ్ చేసిన వాహనాలు, రికార్డులను పరిశీలించారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక ఫిర్యాదురాలు దరఖాస్తు ఇవ్వగా ఏం జరిగింది, ఎందుకు వచ్చారని వివరాలు కనుక్కొని ఆమె సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ సతీశ్, సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, కోర్టు లైజనింగ్ ఇన్‌స్పెక్టర్ కమలాకర్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ ఎస్సైలు మహేశ్, విజయభాస్కర్, అభిలాశ్, సీసీ నితిన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment