ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాల్సిందే
మిరుదొడ్డి(దుబ్బాక): ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని మల్లుపల్లి, ధర్మారం గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ కేంద్రాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు దళారులకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే విక్రయించి కనీస మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. దానిని సక్రమంగా పూర్తి చేసేలా ప్రజలు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం రాజయ్య, ఎంపీడీఓ గణేశ్రెడ్డి, ఏపీఓ సుభాశ్, ఏపీఎం డాకయ్య, సీసీలు బాలరాజు, వైకుంఠం, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment