స్కాలర్‌షిప్ కోసం విద్యార్థుల రాస్తారోకో
హుస్నాబాద్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సావుల ఆదిత్య మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులు మారినా విద్యార్థుల పరిస్థితులు మాత్రం మారడం లేదన్నారు. గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.7,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. యువ వికాసం పేరు మీద విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రాకేష్, రాహుల్, చరణ్, భాను, నవీన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment