పంపకాల్లో పేచీ!
రెండు శాఖల అధికారుల పంపకాల్లో తేడాలు వచ్చాయి. బ్రోకర్ కమిషన్ ఒక శాఖ వారికి అందినట్లు ఆరోపణలు రాగా.. ఈ విషయం తెలిసిన ఇంకో శాఖాధికారులు అలిగినట్లు సమాచారం. వీరు బ్రోకర్‌తో కుమ్మక్కు కావడంతో మధ్యలో ఉన్న లబ్ధిదారులు నలిగిపోతున్నారు. మేలైన జాతి పశువులు దక్కకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో వైపు ప్రభుత్వ లక్ష్యం నేరవేరడం లేదు.
సాక్షి, సిద్దిపేట: 2021– 22 గాను 266 యూనిట్లు గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రౌండ్ అయ్యాయి. పశువులు కొనుగోలు చేసే సమయంలో వెళ్లిన పశు సంవర్థక శాఖకు చెందిన వారికి ఒక్కో యూనిట్‌కు ఒప్పుకున్న కమిషన్‌ను సదరు కంట్రాక్టర్ ఇవ్వలేదని అలిగినట్లు తెలిసింది. అతడి నుంచే కొంత మొత్తం ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖకు చెందిన అధికారులు.. శిక్షణ ఇవ్వలేదని సాకుతో తమిళనాడుకు వెళ్లలేదని సమాచారం. ఈ రెండు శాఖలు బ్రోకర్‌తో కుమ్మక్కు కావడం వల్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని తెలుస్తోంది. మేలు జాతి పశువులను కోల్పోతున్నారు. ఒకవేళ అందజేసినా పశువులను సైతం నెలలోపే లబ్ధిదారులు అమ్మేస్తున్న పరిస్థితులున్నాయి.
సదరు అధికారి కోసం ....
పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా అక్టోబర్ 30న జగత్ కుమార్ రెడ్డి పదవీ విరమణ పొందారు. తొలుత ఇన్‌చార్జి బాధ్యతలు కార్యాలయ ఏడీ కొండల్‌రెడ్డికి అప్పగించాలని పశు సంవర్థక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇదే రోజు సాయంత్రం ఆయనకు బదులుగా హుస్నాబాద్ ఏడీ వెంకట్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గత జేడీ ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన పాడి పశువుల పంపిణీ చేయలేదు. ఇన్‌చార్జిగా వెంకట్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే పాడి పశువులను కొనుగోలు చేసేందుకు తమిళనాడుకు పంపించడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నత అధికారులు ఎస్సీ కార్పొరేషన్ పశువుల పంపిణీ పథకంపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే లబ్ధిదారులకు మేలు జాతి పశువులు అందించే అవకాశం ఉంటుంది.
పశు సంవర్థక శాఖ వర్సెస్
ఎస్సీ కార్పొరేషన్
బ్రోకర్‌తో సదరు అధికారులు కుమ్మక్కు
ఉన్నత అధికారులు దృష్టిసారిస్తేనే లబ్ధిదారులకు ప్రయోజనం
అలాంటిదేమీ లేదు
పశు సంవర్థక శాఖకు సంబంధించి పశువుల గణన, టీకాల వేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వైద్యాధికారులు తమిళనాడుకు వెళ్ల లేదు. డబ్బుల పంపకాల్లో తేడాలు వచ్చాయి అని చర్చ సాగుతుందని సాక్షి అడగగా అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. – వెంకట్ రెడ్డి,
ఇన్‌చార్జి, పశుసంవర్థక శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment