ప్రశాంతంగా స్కాలర్‌షిప్ పరీక్ష
చలి మంటలు
మిరుదొడ్డి(దుబ్బాక): ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. చలికి జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు చలిని తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. ఆదివారం ఉదయం విపరీతంగా పొగమంచు కమ్మేసింది. చలి నుంచి కాపాడుకోవడానికి వృద్ధులు, చిన్నారులు, మహిళలు, యువతీ యువకులు స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీ క్యాపులు ధరిస్తున్నారు. రాత్రి వేళ చలి మంటలు వేసుకుంటూ వెచ్చదనం కోసం పరితపిస్తున్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని 9 పరీక్షల కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లాలో 1,877 మంది విద్యార్థులకు గాను 1823 మంది హాజరయ్యారు. దీంతో హాజరుశాతం 97.12శాతం నమోదు అయ్యింది. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
97.12శాతం హాజరు
Comments
Please login to add a commentAdd a comment