● జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కేంద్రాలు ● హాజరుకానున్న 1,823 మంది విద్యార్థులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 1,823 మంది విద్యార్థులకు గాను తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాలివే..
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలురు) ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) గజ్వేల్, తెలంగాణ మోడల్ స్కూల్ హుస్నాబాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హుస్నాబాద్, ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల సిద్దిపేట, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సిద్దిపేట, ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల సిద్దిపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ (ఏ) సిద్దిపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ (బి) సిద్దిపేట కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
144 సెక్షన్ అమలు
సిద్దిపేటకమాన్: స్కాలర్‌షిప్ పరీక్ష జరగనున్న కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ 2023 (144 సెక్షన్) నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ అనురాధ తెలిపారు. జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాల వద్ద పై నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment