● డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి సందర్శన ● వెంటనే సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెస్షియల్ బాలికల పాఠశాల, కళాశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉందని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతి రెడ్డి అన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వాతిరెడ్డి శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకులలో భోజన నాణ్యత, వంటగది పరిసరాలు, నిల్వ ఉన్న ఆహార పదార్ధాలు, డ్రైనేజీ వ్యవస్థ, బాత్‌రూంలు, తాగునీటి సరఫరాను పరిశీలించారు. గురుకులం ఆవరణలో డస్ట్ బిన్‌లు లేవని, తలుపులు లేని బాత్‌రూంలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, డ్రైనేజీ పైపులు, నీటి కుళాయిల లీకేజీ ఉన్నాయన్నారు. శానిటరీ ప్యాడ్లు బాత్‌రూంలో ఉన్నాయని తెలిపారు. వంటగది, స్టోర్ రూమ్‌ను సందర్శించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం గురుకులంలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆహారం సక్రమంగా ఉండటం లేదని, గాజు ముక్కలు, పురుగులు వస్తున్నాయని, స్టోరేజీ ట్యాంక్ ఒక్కటే ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అనంతరం నిర్వహించిన లీగల్ అవగాహనలో 18 సంవత్సరాలు లోపు పిల్లలు పని చేయకూడదని, బాలలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ గురుకులం ప్రిన్సిపాల్ అస్మా ఫాతిమా, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సెల్ శ్రీకర్ రెడ్డి, సిద్దిపేట న్యాయసేవ సిబ్బంది శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment