యాషెస్ సిరీస్ 2023 ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లకు స్టీవ్ స్మిత్ భయం పట్టుకుంది. పైకి బజ్‌బాల్ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. లోలోపల వారు వణకిపోతున్నారు. ఇంతకీ వారి భయానికి కారణం ఏంటంటే.. ఇంగ్లండ్‌లో స్టీవ్‌కు ఉన్న అరివీర భయంకరమైన ట్రాక్ రికార్డు. మరి ముఖ్యంగా గడిచిన 9 ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్‌లో స్మిత్ చేసిన పరుగులు.
ఇంగ్లండ్ గడ్డపై స్మిత్ గడిచిన 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. ఓవల్‌లో ఇటీవలి ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ (121, 34) చేసిన స్మిత్.. దీనికి ముందు 2019 యాషెస్ 5వ టెస్ట్‌లో 80, 24 పరుగులు.. అదే సిరీస్ నాలుగో టెస్ట్‌లో 211, 82 పరుగులు.. రెండో టెస్ట్‌లో 92.. తొలి టెస్ట్‌లో 144, 142 పరుగులు చేసి ఇంగ్లండ్ గడ్డపై తిరుగులేని రికార్డును కలిగి ఉన్నాడు.
ఈ ఫామే ప్రస్తుతం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. స్మిత్‌కు కట్టడి చేసేందుకు వారు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ, అవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి. స్మిత్ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడా.. అతన్ని ఔట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు కత్తి మీద సామే అవుతుంది.
కాగా, 5 మ్యాచ్‌ల యాషెస్ 2023 సిరీస్ రేపటి (జూన్ 16) నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా, రెండోది లార్డ్స్‌లో, మూడో మ్యాచ్ హెడింగ్లేలో, నాలుగోది ఓల్డ్ ట్రాఫర్డ్‌లో, ఐదో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్‌లో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి యాషెస్ సిరీస్‌లో (5 మ్యాచ్‌లు) ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుపొందింది.
యాషెస్ 2023 షెడ్యూల్..
తొలి టెస్ట్: జూన్ 16-20
రెండో టెస్ట్: జూన్ 28-జులై 2
మూడో టెస్ట్: జులై 6-10
నాలుగో టెస్ట్: జులై 19-23
ఐదో టెస్ట్: జులై 27-31
తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా)..
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్‌సన్, మార్క్ వుడ్
ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, బోలాండ్, నాథన్ లైయన్
-జాన్‌పాల్, సాక్షివెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment