IND Vs PAK Asia Cup 2022: Injured Shaheen Afridi, Rishabh Pant And Virat Kohli Interaction Video Viral - Sakshi
Sakshi News home page

Shaheen Afridi: నేనూ నీలాగే ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టాలనుకుంటున్నా పంత్‌: పాక్‌ బౌలర్‌

Published Fri, Aug 26 2022 11:29 AM | Last Updated on Fri, Aug 26 2022 3:59 PM

Asia Cup 2022 Ind Vs Pak Indian Cricketers Interact With Shaheen Afridi Viral - Sakshi

షాహిన్‌ ఆఫ్రిదితో రిషభ్‌ పంత్‌, యజువేంద్ర చహల్‌(PC: PCB Twitter)

Asia Cup 2022 India Vs Pakistan: ‘‘నేను కూడా నీలాగే మంచి బ్యాటర్‌ కావాలనుకుంటున్నాను.. ఒంటిచేత్తో సిక్సర్లు బాదాలని కోరుకుంటున్నా’’... ‘‘అవునా.. నువ్వు ఫాస్ట్‌బౌలర్‌ కదా! తప్పకుండా! ప్రయత్నించు’’ పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది.. టీమిండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇది. ఆసియా కప్‌-2022 టోర్నీ 15వ ఎడిషన్‌ శనివారం(ఆగష్టు 27) ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ తదితర జట్లు యూఏఈకి చేరుకున్నాయి. మెగా ఈవెంట్‌ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీసులో మునిగిపోయాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందుకు పాక్‌ కీలక బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే.

కోహ్లి, చహల్‌, రాహుల్‌ పలకరింపు..
అయినప్పటికీ జట్టుతో కలిసి అతడు దుబాయ్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు యజువేంద్ర చహల్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు అతడిని పలకరించారు. విరాట్‌ కోహ్లి సైతం ఆఫ్రిదితో కాసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. స్టార్లంతా ఒక్కచోట అంటూ ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

ఆదివారం హైవోల్టేజ్‌ మ్యాచ్‌
ఇక అంతకుముందు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను కోహ్లి పలకరించిన దృశ్యాలను బీసీసీఐ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలపై స్పందించిన క్రికెట్‌ ప్రేమికులు.. ‘‘మైదానంలో మాత్రమే ప్రత్యర్థులు.. క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తున్నారు. పరస్పరం ఆత్మీయ పలకరింపులతో మనసు దోచుకుంటున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆదివారం(ఆగష్టు 28)న భారత్‌- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్‌ ఆందోళన!
Asia Cup 2022: భారత్‌- పాకిస్తాన్‌ ఏ జట్టు ఆటగాడైనా ఒకటే! మేము అన్నదమ్ముల్లా ఉంటాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement