
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ అతడి సారథ్యంలో వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. సోమవారం(ఏప్రిల్ 1)న రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది.
అయితే రాజస్తాన్‌తో ఓటమి అనంతరం హార్దిక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ పూర్తియ్యాక సహాచర ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తే.. పాండ్యా మాత్రం డౌగట్‌లో ఒంటరిగా కూర్చోని ఉండిపోయాడు. పాండ్యా ఏదో కోల్పోయినట్లు ముఖంం పెట్టుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా హార్దిక్ కెప్టెన్సీ పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి తిరిగి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment