T20 WC: హార్దిక్‌, రాహుల్‌కు నో ఛాన్స్‌.. ఆ ముగ్గురూ ఫిక్స్‌! | Sakshi
Sakshi News home page

T20 WC: హార్దిక్‌, రాహుల్‌కు నో ఛాన్స్‌.. ఆ ముగ్గురూ ఫిక్స్‌!

Published Wed, Apr 10 2024 9:42 AM

Hardik Rahul Snubbed But Virat Rohit: Venkatesh Prasad T20 WC Message Viral - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024 ఆడే భారత జట్టులో చోటు కోసం ఆటగాళ్ల మధ్య పోటీ పెరుగుతోంది. ఐపీఎల్‌-2024లో ప్రదర్శన ఆధారంగా ప్రధాన జట్టులో స్థానం సంపాదించే ప్లేయర్ల పేర్లు ఖరారు కానున్నాయి.

ఇక కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరును బీసీసీఐ ఇప్పటికే ఖరారు చేయగా.. హార్దిక్‌ పాండ్యా అతడికి డిప్యూటీగా మాత్రమే వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సుదీర్ఘ విరామం తర్వాత టీ20లలో బ్యాట్‌ ఝులిపిస్తున్న విరాట్‌ కోహ్లి తన బెర్తును ఖరారు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున కోహ్లి ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 316 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున పేస్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే(ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు- 176 రన్స్‌) సైతం దంచికొడుతున్నాడు.

మెరుపు ఇన్నింగ్స్‌ ఆడుతూ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌, టీమిండియా నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ సైతం ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా మెరుపులు మెరిపిస్తున్నాడు.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం తర్వాత కోలుకుని ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగినా ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ తిరిగి పుంజుకోగలడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టులో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూర్పు గురించి ఆసక్తికర ట్వీట్‌ చేశాడు.

విరాట్‌, రోహిత్‌తో పాటు ఆ ముగ్గురూ
‘‘స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతూ శివం దూబే మెరుపులు మెరిపిస్తున్నాడు. సూర్య అంతర్జాతీయ స్థాయిలో టీ20 నంబర్‌ వన్‌ బ్యాటర్‌. ఇక ఫినిషర్‌గా రింకూ సింగ్‌ అసాధారణ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ ముగ్గురిని టీ20 ప్రపంచకప్‌ భారత తుదిజట్టులో ఆడిస్తే గొప్పగా ఉంటుంది. ఇక విరాట్‌, రోహిత్‌ను కూడా కలుపుకోగా.. కేవలం వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు మాత్రమే చోటు ఉంటుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి’’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ పేర్కొన్నాడు.

పాండ్యా, రాహుల్‌, అయ్యర్‌కు మొండిచేయి
తన జట్టులో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ పేర్లను వెంకటేశ్‌ ప్రసాద్‌ ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా ఐపీఎల్‌-2024లో పాండ్యా, రాహుల్‌ ఇప్పటి వరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 

మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్ల కోటాలో రాహుల్‌కు రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ నుంచి పోటీ ఎదురవుతోంది. అయితే, అందకి కంటే సంజూ ఓ అడుగు ముందే ఉన్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన ఈ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ 178 పరుగులు చేశాడు.

చదవండి: #SRHvsPBKS: నరాలు తెగే ఉత్కంఠ: ఆఖరి బంతి వరకు ‘భయపెట్టిన’ ఉనాద్కట్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement