జితేశ్‌ శర్మ సంచలనం.. ఐపీఎల్‌ చరిత్రలో పలు రికార్డులు బద్దలు | Highest Strike-rate For Jitesh Sharma-Some Records Broken MI Vs PBKS | Sakshi
Sakshi News home page

MI Vs PBKS: జితేశ్‌ శర్మ సంచలనం.. ఐపీఎల్‌ చరిత్రలో పలు రికార్డులు బద్దలు

Published Sat, Apr 22 2023 10:38 PM | Last Updated on Sun, Apr 23 2023 6:03 AM

Highest Strike-rate For Jitesh Sharma-Some Records Broken MI Vs PBKS - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సామ్‌ కరన్‌, హర్‌ప్రీత్‌ బాటియా, జితేశ్‌ శర్మలు కలిసి చేసిన విధ్వంసానికి రికార్డులు పగిలిపోయాయి. చివరి ఆరు ఓవర్లలో పంజాబ్‌ 109 పరుగులు చేసింది. దీనితో పాటు కొన్ని రికార్డులను పరిశీలిద్దాం.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ సంచలనం సృష్టించాడు. ఏడు బంతు​ల్లోనే 25 పరుగులు చేసిన జితేశ్‌ శర్మ పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. జితేశ్‌ 357.14 స్ట్రైక్‌రేట్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో బానుక రాజపక్స(9 బంతుల్లో 31 పరుగులు, 344.44 స్ట్రైక్‌రేట్‌), కేఎల్‌ రాహుల్‌(16 బంతుల్లో 51 పరుగులు, 318.75 స్ట్రైక్‌రేట్‌), నికోలస్‌ పూరన్‌ (8 బంతుల్లో 25*పరుగుఉల, 312.50 స్ట్రైక్‌రేట్‌) ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చివరి ఆరు ఓవర్లలో పంజాబ్‌ కింగ్స్‌  109 పరుగులు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో చివరి ఆరు ఓవర్లలో ఇన్ని పరుగులు చేయడం పంజాబ్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా పంజాబ్‌ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆర్‌సీబీ గుజరాత్‌ లయన్స్‌పై చివరి ఆరు ఓవర్లలో 126 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా.. 2020లో పంజాబ్‌ కింగ్స్‌పై ముంబై 104 పరుగులు చేసింది.

ఇక ముంబై ఇండియన్స్‌ తరపున ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అర్జున్‌ టెండూల్కర్‌ నిలిచాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ ఒక ఓవర్లో 31 పరుగులిచ్చుకున్నాడు. తొలి స్థానంలో డేనియల్‌ సామ్స్‌ (35 పరుగులు వర్సెస్‌ కేకేఆర్‌) ఉన్నాడు. 

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌-హర్‌ప్రీత్‌ బాటియాలు ఐదో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐదో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. తొలి స్థానంలో డేవిడ్‌ మిల్లర్‌-రాజ్‌గోపాల్‌ సతీష్‌(130*పరుగులు) తొలి స్థానంలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement