
దక్షిణాఫ్రికా చేతిలో 1-2తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. ఈనెల 19 నుంచి ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం సన్నాహాలను మొదలుపెట్టింది. ఈ క్రమంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించింది.
ODI MODE 🔛
— BCCI (@BCCI) January 17, 2022
We are here at Boland Park to begin prep for the ODIs 👍🏻#TeamIndia | #SAvIND pic.twitter.com/psMVDaNwbc
మొదటి రెండు వన్డేలకు వేదికైన బోలాండ్ పార్క్‌లో టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన దృశ్యాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లోని ఓ ఆసక్తికర దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. గేమ్ ప్లానింగ్‌లో భాగంగా కెప్టెన్, కోచ్‌ల సలహాలను మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసక్తిగా ఆలికిస్తున్న దృశ్యం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది.
ఇనాళ్లు కనుసైగలతో జట్టును శాసించిన కోహ్లి.. సాధారణ ఆటగాడిగా మారిపోయాడు పాపం అంటూ అభిమానులు సానుభూతిని వ్యక్తం చేస్తుండగా, జట్టు ప్రయోజనాల కోసం కోహ్లి ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాండంటూ అతని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. కాగా, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరంగా ఉండడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ తొలిసారి వన్డే సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సిరీస్‌కు బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే ఈనెల 19న జరగనుండగా.. రెండో వన్డే 21న, మూడో వన్డే 23న జరగనున్నాయి.
చదవండి: యాషెస్ సెలబ్రేషన్స్ సమయంలో ఆసీస్ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..!
Comments
Please login to add a commentAdd a comment