IND vs WI 3rd ODI: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆఖరి వన్డేలో నిరాశపరిచాడు. 6 పరుగులకే అవుటై పెవిలియన్ చేరాడు. విండీస్ బౌలర్ ఫ్యాబియన్ అలెన్ వేసిన బంతిని ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆడేందుకు ప్రయత్నించిన సూర్య విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా బ్రూక్స్ రెండు చేతులతో ఒడిసిపట్టాడు. ఈ సూపర్ క్యాచ్‌తో సూర్య మైదానం వీడక తప్పలేదు.
కాగా రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన సూర్యకుమార్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి 6 మ్యాచ్‌లలో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక మూడో వన్డేలో 7 బంతులు ఎదుర్కొన్న అతడు.. 6 పరుగులు(ఫోర్ 1) మాత్రమే చేయడం గమనార్హం. ఈ క్రమంలో.. ‘‘నువ్వు ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తావని అనుకుంటే.. మా ఆశలపై నీళ్లు చల్లావు కదా సూర్య’’ అంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... ఇప్పటికే టీమిండియా వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రపు మూడో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ(13), శిఖర్ ధావన్(10), కోహ్లి(డకౌట్), సూర్యకుమార్(6) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(80), రిషభ్ పంత్(56) అర్ధ సెంచరీలతో రాణించారు. 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది.
చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్!
Ind Vs Wi 3rd ODI- Virat Kohli Duck Out: ఏంటిది కోహ్లి.. 8, 18, 0... మరీ ఇంత చెత్తగా.. తుది జట్టులో ఉంటావా? లేదా?
Comments
Please login to add a commentAdd a comment