
బార్బోడస్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన విండీస్ ఆటగాడు షెమ్రాన్ హెట్‌మైర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను ఎదుర్కోవడానికి హెట్‌మైర్ చాలా కష్టపడ్డాడు. 19 బంతులు ఎదుర్కొన్న హెట్‌మైర్ ఒక బౌండరీ సాయంతో 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. జడేజా బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు.
ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్న సమయంలో.. హెట్‌మైర్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జట్టు క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడు చెత్త షాట్ ఆడి వికెట్‌ను చేజార్చుకున్న హెట్‌మైర్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఓ టీమిండియా అభిమాని స్పందిస్తూ.. "అక్కడ ఉన్నది జడ్డూ..కొంచెం చూసి ఆడాలంటూ" కామెంట్ చేశాడు. తొలి వన్డేలో జడేజా మూడు వికెట్లతో పాటు 16 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది.
భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు. అనంతరం 15 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిండియా బ్యాటర్లలో కిషన్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: నేను అస్సలు ఊహించలేదు.. కానీ క్రెడిట్ మొత్తం వాళ్లకే! అతడు సూపర్: రోహిత్ శర్మ
Jadeja: Ja Shimron Ja!@imjadeja#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/aBTJmL7ENx
— FanCode (@FanCode) July 27, 2023
Comments
Please login to add a commentAdd a comment