India tour of West Indies, 2023: బార్బడోస్‌కు ప్రయాణించే క్రమంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం. ట్రినిడాడ్ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. తెల్లవారుజామున మూడింటి వరకు వెయిట్ చేయాల్సి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో పలువురు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ ఉన్నతాధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా డొమినికాలో గెలిచిన రోహిత్ సేన.. వర్షం కారణంగా ట్రినిడాడ్‌లో డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో జూలై 12- 24 వరకు జరిగిన ఈ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత జట్టు.. జూలై 27 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది.
బార్బడోస్ వెళ్లేందుకు
ఈ నేపథ్యంలో టెస్టులతో పాటు వన్డే జట్టులోనూ భాగమైన ఆటగాళ్లు ట్రినిడాడ్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత తొలి వన్డే వేదికగా బార్బడోస్‌కు సోమవారం రాత్రే పయనమైనట్లు సమాచారం. ఇందుకోసం బీసీసీఐ రాత్రి 11 గంటల విమానానికి టిక్కెట్లు బుక్ చేయగా.. మూడింటి దాకా ప్రయాణం మొదలుకానట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తమ నిద్రకు భంగం వాటిల్లిందని, కావాల్సినంత విశ్రాంతి లభిస్తేనే ప్రాక్టీస్‌కు తగినంత సమయం దొరుకుతుందంటూ ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై వాళ్లు బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది.
హోటల్ నుంచి అప్పుడే బయల్దేరారు
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు రాత్రి 8.40 నిమిషాలకే హోటల్ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. చాలా సేపు అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఇకపై లేట్‌నైట్ కాకుండా ఉదయం ప్రయాణం చేయడానికి వీలుగా టిక్కెట్లు బుక్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది. బీసీసీఐ అందుకు సానుకూలంగా స్పందించింది. తదుపరి షెడ్యూల్‌లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పింది’’ అని పేర్కొన్నాయి.
వాళ్లు వచ్చేశారు
కాగా వన్డే జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ తదితరులు ఇప్పటికే బార్బడోస్ చేరుకున్నారు. ఇక జూలై 27- ఆగష్టు 01 వరకు విండీస్- టీమిండియా మధ్య మూడు వన్డేలు జరుగనున్న విషయం తెలిసిందే.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
చదవండి: దేశం కంటే వాళ్లే ఎక్కువైపోయారా? ఈసారి వరల్డ్‌కప్ గెలిచేది..
Comments
Please login to add a commentAdd a comment