చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 280 పరుగులతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో బంగ్లాను భారత జట్టు చిత్తు చేసింది. పాక్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయంతో భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లా టైగర్స్‌కు రోహిత్ సేన చుక్కలు చూపించింది.
515 పరుగుల భారీ లక్ష్య చేధనలో బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని 234 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. అశ్విన్ 6 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. .జడేజా 3 వికెట్లతో అదరగొట్టాడు. ఆటు బ్యాటింగ్‌లోనూ అశూ సెంచరీతో మెరిశాడు. అశ్విన్‌తో పాటు గిల్, జడేజా, పంత్, జైశ్వాల్ బ్యాటింగ్‌లో సత్తాచాటారు.
బీసీసీఐ కీలక ప్రకటన
ఇక తొలి టెస్టులో విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాతో రెండో టెస్టుపై కన్నేసింది. బంగ్లాను మరోసారి క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య సెకెండ్ టెస్టు జరగనుంది.ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
బంగ్లాతో రెండో టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్టుకు ప్రకటించిన జట్టునే రెండో టెస్టుకు కొనసాగించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా తొలుత కేవలం మొదటి టెస్టుకే జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. దీంతో రెండు టెస్టుకు భారత జట్టులో మార్పులు ఉండవచ్చు అని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఎటువంటి మార్పులకు మొగ్గు చూపలేదు.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
Comments
Please login to add a commentAdd a comment