వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 19న పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పుణేకు చేరుకున్న భారత జట్టు.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
పుణేలోని వికెట్ స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్నందన అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్ స్ధానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా బుమ్రా విశ్రాంతి ఇచ్చి షమీని ఆడించే అవకాశమున్నట్లు క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. షకీబ్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడి స్ధానంలో లిటన్ దాస్ బంగ్లా జట్టును నడిపించే ఛాన్స్ ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హెచ్‌హెచ్ పాండ్యా, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఆర్‌ఎ జడేజా, శార్దూల్ ఠాకూర్, జెజె బుమ్రా, మహ్మద్ సిరాజ్, కెఎల్ యాదవ్
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, తంజిద్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహది హసన్, మహ్మదుల్లా, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్
చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. కోహ్లిని వెనక్కి నెట్టి
Comments
Please login to add a commentAdd a comment