బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు కివీస్ ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు. పర్యాటక జట్టు పేసర్ల దాటికి భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.
వచ్చినవారు వచ్చినట్లగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో అదరగొట్టగా.. యువ పేసర్ విలియం ఓ రూర్క్ 4 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు.
టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్‌ఖాన్, కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2), జైశ్వాల్(13) పరుగులు మాత్రమే చేశారు. కాగా భారత్‌కు ఇది టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోర్లు ఇవే..
అడిలైడ్‌లో 36 vs ఆస్ట్రేలియా, 2020
లార్డ్స్‌లో 42 vs ఇంగ్లండ్, 1974
బెంగళూరులో 46 vs న్యూజిలాండ్, 2024*
బ్రిస్బేన్‌లో 58 vs ఆస్ట్రేలియా, 1947
మాంచెస్టర్‌లో 58 vs ఇంగ్లండ్, 1952
చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
Comments
Please login to add a commentAdd a comment