Rohit Sharma As T20 Captain.. టి20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆరు నెలల చర్చ ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం పక్కన పెడితే.. కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే సమస్య లేకపోయినప్పటికి రానున్న కాలంలో కెప్టెన్ సమస్య మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 34 ఏళ్లు. ఫిట్‌నెస్ దృష్యా రోహిత్ మహా అయితే ఇంకో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రోహిత్ తర్వాతి కాలంలో మిగతా రెండు ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి.
చదవండి: Virat Kohli: కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై!
అయితే టి20 అంటేనే దూకుడుకు మారుపేరు. జట్టు యువరక్తంతో నిండి ఉంటేనే బలంగా కనిపిస్తుందనేది అందరి నమ్మకం. 2007 టి20 ప్రపంచకప్ సమయంలో అదే నిజమైంది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్ల వయసు యావరేజ్ 27 కావడం విశేషం. దీన్నిబట్టి చూసుకుంటే రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ ఇప్పటినుంచే ఎవరని కెప్టెన్ చేయాలనే దానిపై అన్వేషణ సాగించాలి. ప్రస్తుత తరుణంలో కేఎల్ రాహుల్, శ్రెయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు పరిమిత, టి20ల్లో కెప్టెన్‌గా రాణిస్తారని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని చూస్తే మాత్రం వీరి ముగ్గురిలో ఎవరో ఒకరిని త్వరలోనే చూడొచ్చు.
చదవండి: Irfan Pathan: ఇది ఊహించలేదు.. కోహ్లి నిర్ణయం షాక్‌కు గురిచేసింది
ఇక కోహ్లి కూడా పరిమిత ఓవర్లతో పాటు టెస్టు కెప్టెన్‌గా ఇంకో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో బీసీసీఐ మూడు ఫార్మాట్లకు పూర్తి స్థాయి కెప్టెన్‌ను నియమిస్తుందా లేక ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌ను ఎంపికచేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment