కరాచీ: టీమిండియా జట్టులో యంగ్ ఆటగాళ్లకు కొదువ లేదని.. ఎప్పటికప్పుడు జట్టులోకి కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్-ఉల్-హక్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా 66 పరుగులతో విజయం సాధించిన అనంతరం ఇంజమామ్ స్పందించాడు.
''బహుశా టీమిండియా వద్ద ఏదైనా మెషిన్ గన్ ఉందనుకుంటా. రోజు ఎవరో ఒక కొత్త ఆటగాడు జట్టులో చేరుతూనే ఉన్నాడు. ఫార్మాట్ ఏదైనా యువ ఆటగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రసిధ్ కృష్ణ, కృనాల్ పాండ్యాలు అదరగొట్టారు. ఒకరు బ్యాటింగ్.. మరొకరు బౌలింగ్‌లో విజృంభించారు.అరంగేట్రంలోనే రాణిస్తే జట్టులో సీనియర్ల పక్కన స్థానం సుస్థిరం చేసుకునే అంశాన్ని ఇప్పుడు వచ్చిన ఆటగాళ్లు ఒంట బట్టించుకున్నారు. గత ఆరు నెలలుగా చూసుకుంటే.. ఆసీస్ సిరీస్ నుంచి మొదలుకొని జట్టులోని యంగ్ ఆటగాళ్లంతా అదరగొట్టేస్తున్నారు. సీనియర్స్ వాళ్ల రోల్ పోషిస్తుండగా.. జూనియర్లు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోతున్నారు.
ఆసీస్ సిరీస్‌లో నటరాజన్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్.. తాజగా ఇంగ్లండ్ సిరీస్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, కృనాల్‌లు అందుకు ఉదాహరణ. ప్రస్తుతం భారత్ ఆడుతున్న క్రికెట్‌లో నాణ్యత ఎక్కువగా కనిపిస్తుంది.. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఎగురేసుకుపోవడం ఖాయం. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రాహుల్- కృనాల్‌ల మధ్య ఏర్పడిన 112 పరుగుల భాగస్వామ్యం టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 270 పరుగుల వద్దే భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందన్న దశలో వీరిద్దరు కలిసి జట్టు స్కోరు 300 దాటించారు. అందులో కృనాల్ 31 బంతుల్లోనే 58 పరుగులు సాధించడం చూస్తుంటే టీమిండియా వద్ద మెషిన్ గన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి:
అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్
టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment