photo courtesy: IPL
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 2) రాజస్థాన్, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. తొలి దశలో (ఏప్రిల్ 18) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆ మ్యాచ్‌లో జోస్ బట్లర్ (61 బంతుల్లో 103) సూపర్ సెంచరీతో విజృంభించడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో కేకేఆర్ సైతం చివరి వరకు పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టులో ఆరోన్ ఫించ్ (58), కెప్టెన్ శ్రేయస్ (85) మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు.
ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇరు జట్ల జయాపజయాల రికార్డులను పరిశీలిస్తే.. రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో ఆఖరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..
రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఇప్పటివరకు తలపడిన 25 సందర్భాల్లో కేకేఆర్ 13, రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. వాంఖడే వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక మ్యాచ్‌లో రాజస్థాన్‌నే విజయం వరించింది.
పిచ్ పరిస్థితి ఎలా ఉందంటే..
ముంబైలోని వాంఖడే పిచ్ అంచనాలకు విరుద్దంగా స్వభావాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్లు గెలుపొందగా.. అంతకు ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ప్రస్తుత పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి జట్టు ఛేజింగ్‌వైపే మొగ్గు చూపవచ్చు.
విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే..
ఇరు జట్ల తాజా ఫామ్‌ను బట్టి చూస్తే కేకేఆర్‌తో పోలిస్తే రాజస్థాన్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఇరు జట్లు గత మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో ఓడినప్పటికీ కేకేఆర్ కంటే రాజస్థాన్ అన్ని రంగాల్లో మెరుగ్గా ఉంది. కేకేఆర్ జట్టులో కెప్టెన్ శ్రేయస్ మినహా మిగతా ఆటగాళ్లంతా మూకుమ్మడిగా విఫలమవుతుండగా, రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ చహల్ భీకర ఫామ్‌లో ఉండి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
తుది జట్లు (అంచనా):
కేకేఆర్: ఆరోన్ ఫించ్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్,నితీశ్ రాణా, బాబా ఇంద్రజిత్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, పడిక్కల్, సంజూ శాంసన్, డారిల్ మిచెల్, హెట్మైర్, రియాన్ పరాగ్, అశ్విన్, బౌల్ట్, ప్రసిద్ద్, చహల్, కుల్దీప్ సేన్
చదవండి:IPL 2022: సీఎస్‌కే తరఫున మా అద్బుత రికార్డు.. ఫాఫ్ కుళ్లుకొని ఉంటాడు!
Comments
Please login to add a commentAdd a comment