బుమ్రాతో పాండ్యా (ఫైల్ ఫొటో PC: BCCI)
IPL 2024- Mimbai Indians Captain: ఐపీఎల్ స్టార్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ 2023లో కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలిచింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకోవడమే గాక.. కెప్టెన్‌గానూ నియమించింది. ఐదుసార్లు తమను చాంపియన్‌గా నిలిపిన భారత జట్టు సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.
టీమిండియా భావి కెప్టెన్‌గా భావిస్తున్న హార్దిక్ పాండ్యాను తిరిగి తమ జట్టులో చేర్చుకోవడం ద్వారా బ్రాండ్ వాల్యూను మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ముంబై ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే వంద కోట్ల రూపాయాలకు పైగా వెచ్చించి అతడిని ట్రేడ్ చేసుకుందనే ఊహాగానాలు వినిపించాయి.
పాండ్యా దూరమైతే జట్టును నడిపించేది ఎవరు?
అయితే, వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడ్డ పాండ్యా ఇప్పటికీ కోలుకోకపోవడంతో ముంబైకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఐపీఎల్-2024కు కూడా అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గనుక ఈ ఏడాది ఎడిషన్ మొత్తానికి దూరమైతే అతడి స్థానంలో ఎవరు నాయకుడిగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆ ఛాన్సే లేదు
రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా ప్రకటించాలని అభిమానులు ఆశిస్తున్నా.. తాను ఆటగాడిగా కొనసాగేందుకు ఇష్టపడుతున్నట్లు హిట్‌మ్యాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అంతేగాక.. తనను తప్పించిన తర్వాత మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపడం సహజం. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా లేదంటే భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైని నడిపించే అవకాశం ఉంది.
సూర్యకు కూడా గాయం
కానీ పాండ్యా మాదిరే సూర్య కూడా గాయపడ్డ సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడి చీలమండకు గాయం కాగా నొప్పి తీవ్రతరం కావడంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుభజ్ఞుడు బుమ్రా వైపే మొగ్గు
ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచీ బుమ్రా ముంబై ఇండియన్స్‌తోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు. సీనియర్ ప్లేయర్‌గా డ్రెస్సింగ్‌రూం వాతావరణం, కల్చర్ గురించి అతడికి బాగా తెలుసు. అంతేగాక.. టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా బుమ్రాకు ఉంది. టెస్టు జట్టుతో పాటు ఐర్లాండ్ సిరీస్‌లో టీమిండియా టీ20 కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. కాబట్టి ఫ్రాంఛైజీ అతడి వైపై మొగ్గు చూపే అవకాశం ఉంది.
చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్‌లో ఎంట్రీ.. దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్
Comments
Please login to add a commentAdd a comment